- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ప్రభంజనం..MLAగా గెలిచిన పనిమనిషి !
కలితా మాఝీ ( Kalita Majhi ) అనే మహిళ ఆస్గ్రామ్ అనే ఎస్సీ నియోజక వర్గం నుంచి BJP తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. నెలకు రూ.2500 సంపాదించే ఓ పనిమనిషి ఎమ్మెల్యే అయ్యారు. కలితా మాఝీ ( Kalita Majhi ) అనే మహిళ ఆస్గ్రామ్ అనే ఎస్సీ నియోజక వర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. TMC పార్టీ అభ్యర్థిపై 12 వేల ఓట్ల మెజారిటీతో కలితా మాఝీ విక్టరీ కొట్టారు. ఈ ఎన్నికలో కలితా మాఝీ 1,07,692 ఓట్లు సాధించడం గమనార్హం. గత రెండు దశాబ్దాలుగా నాలుగు ఇళ్లల్లో పాత్రలు కడగడం, వంట పనులు చేయడం లాంటివి చేస్తున్నారు కలితా మాఝీ.
ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆమె పనిమనిషిగా తన వృత్తిని కొనసాగిస్తూనే, ప్రచారంలో ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే కలితా మాఝీకు మంచి మైలేజ్ వచ్చింది. దీంతో నెలకు రూ.2500 సంపాదించే కలితా మాఝీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషం. ఇక కలితా మాఝీ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది ఇలా ఉండగా వెస్ట్ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ 206 స్థానాలు గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్ 81 స్థానాలకు పరిమితం అయింది. ఇతరులకు ఆరు స్థానాలు దక్కాయి. దీంతో పశ్చిమ బెంగాల్ ను కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకుంది






