BIG BREAKING: UPSC ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. మళ్లీ పరీక్ష ఎప్పుడంటే?

by Disha Web Desk 1 |
BIG BREAKING: UPSC ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. మళ్లీ పరీక్ష ఎప్పుడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో UPSC పరీక్షలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షా తేదీల్లో మార్పులు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే మే 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించగా.. రీ షెడ్యూల్‌తో ఆ పరీక్ష జూన్ 16కు వాయిదా పడింది. అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షను మే 26న జరగనుండగా జూన్ 16న నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఇండియన్‌ సివిల్‌ సర్వీసుల్లో 1,056 పోర్టుల భర్తీకి సివిల్ సర్వీసెస్ పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవ‌రిలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి రెండో వారం వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల‌ను కూడా స్వీక‌రించారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా జూన్ 16న ప్రిలిమిన‌రీ, మెయిన్స్ అక్టోబర్ 19 నుంచి నిర్వహించనున్నారు.



Next Story

Most Viewed