బీజేపీ ఓడిపోవడం ఖాయం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

by Dishafeatures2 |
బీజేపీ ఓడిపోవడం ఖాయం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2024 సార్వత్రిక ఎన్నికలపై టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అన్నారు. బీజేపీకి 200 సీట్ల కూడా రావని జోస్యం చెప్పారు. అధికారం తాత్కాలికమైనదేనని, పదవి రావచ్చు పోవచ్చు కానీ ప్రజాస్వామ్యం శాశ్వతం అన్నారు. బుధారం మీడియాతో మాట్లాడిన ఆమె టీఎంసీకి జాతీయ పార్టీ హోదాను తిరిగి కల్పించాలని తాను అమిత్ షాకు ఫోన్ చెసినట్లు రుజువు చేస్తే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తన పార్టీ పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని గుర్తుంచుకోవాలన్నారు. విపక్షాల మధ్య ఐక్యత లేదనే విమర్శలపై స్పందించిన మమతా.. కొన్నిసార్లు నిశ్శబ్దమే బంగారంలా ఉంటుందని, ప్రతిపక్ష పార్టీలు కలిసి కూర్చోవడం లేదని అనుకోవద్దని ప్రతి ఒక్కరూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. టైమ్ వస్తే అది సుడిగాలిలా ఉంటుందని చెప్పారు.



Next Story

Most Viewed