- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ దెబ్బకు బంగ్లాదేశ్ షాక్.. యూనుస్ కుప్పి గంతులకు చెక్
Operation Sindoor: బంగ్లాదేశ్లో కొత్తగా పదవిలోకి వచ్చినటువంటి మహమ్మద్ యూనుస్ గత కొంతకాలంగా చైనాకు అనుకూలంగా భారత్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తూ రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: Operation Sindoor: బంగ్లాదేశ్లో కొత్తగా పదవిలోకి వచ్చినటువంటి మహమ్మద్ యూనుస్ గత కొంతకాలంగా చైనాకు అనుకూలంగా భారత్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తూ రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్తాన్ పై జరిపిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు, బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం షాకుకు గురైంది అని చెప్పవచ్చు.
ఇంతకాలం భారత్ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ వచ్చిన బంగ్లాదేశ్, ఈ దెబ్బతో దారికి రావడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఢాకా: భారతదేశం, పాకిస్తాన్ మధ్య తీవ్రమవుతున్న వివాదంపై బంగ్లాదేశ్ బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది, రెండు పొరుగు దేశాలు సంయమనం పాటించాలని, ఈ ప్రాంతంలో పరిస్థితిని మరింత దిగజార్చే చర్యలను నివారించాలని కోరింది.
"ప్రాంతీయ శాంతి, శ్రేయస్సు స్థిరత్వం స్ఫూర్తితో, దౌత్య ప్రయత్నాల ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయని, ప్రజల ప్రయోజనం కోసం శాంతి గెలుస్తుందని బంగ్లాదేశ్ ఆశాభావంతో ఉంది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. మరోవైపు ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి మహమ్మద్ యూనుస్ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. చైనా తో అనుకూలంగా ఉంటూ భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని వీడి, భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. దీనిపై బంగ్లాదేశ్ పలుమార్లు తమ దేశానికి అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. దీనికి తోడు భారత్ వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్లో చోటు ఇస్తూ నిర్ణయాలు సైతం తీసుకుంటోంది. అయితే తాజాగా జరిపిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు దక్షిణాసియాలో భారత్ ఒక తిరుగులేని శక్తి అని నిరూపితం అయింది.
దేశ ప్రయోజనాల కోసం భారత్ ఎదురు దాడి చేస్తుందని, విదేశీ గడ్డపైకి అడుగుపెట్టి లోపలికి వచ్చి మరి ఉగ్రముకల అంతం పడుతుందని ప్రపంచానికి అర్థం అయింది. మరి బంగ్లాదేశ్ ఇకపై ఎలా ఉంటుందో వేచి చూడాలి.






