బాబాను కాల్చి చంపిన దుండగులు.. శాంతిభద్రతలను కాపాడాలని సిక్కు సమాజానికి పోలీసులు విజ్ఞప్తి

by Disha Web Desk 17 |
బాబాను కాల్చి చంపిన దుండగులు.. శాంతిభద్రతలను కాపాడాలని సిక్కు సమాజానికి పోలీసులు విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని నానక్‌మట్ట సాహిబ్ గురుద్వారాలో ప్రముఖ బాబా టార్సేమ్ సింగ్‌‌ను గురువారం తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మందిరం ఆవరణలో కాల్చి చంపారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం, గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మందిరం లోపల బాబా కుర్చీపై కూర్చుని ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నేరుగా ఆయన వద్దకు వెళ్లి తుపాకితో కాల్పులు జరిపారు. వెంటనే బాబాను ఖతిమాలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ హత్యపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని నానక్‌మట్టా ప్రాంతంలో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించారు, శాంతిభద్రతలను కాపాడాలని సిక్కు సమాజానికి పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసు అధికారులు కేంద్ర ఏజెన్సీలను కూడా సంప్రదించారు. అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నానక్‌మట్ట సాహిబ్ గురుద్వారా అనేది ఆ రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో రుద్రపూర్-తనక్‌పూర్ మార్గంలో ఉన్న సిక్కుల పుణ్యక్షేత్రం.


Next Story