జనవరి 22 చారిత్రాత్మకమైన రోజు.. నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి

by Dishanational1 |
జనవరి 22 చారిత్రాత్మకమైన రోజు.. నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన జనవరి 22 'చారిత్రాత్మకమైన రోజు' అని నోబెల్ శాంతి గ్రహీత, సంఘ సంస్కర్త కైలాష్ సత్యార్థి అన్నారు. సోమవారం అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఉత్సవానికి హాజరైన ఆయన.. ప్రపంచం మొత్తం యుద్ధాలు, హింస నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 'ప్రపంచాన్ని హింస రహితంగా మార్చడమే మా సంకల్పం. దాన్ని సాధించడం మన బాధ్యతని, అయోధ్య సందేశం కూడా ఇదేనని' కైలాష్ పేర్కొన్నారు. జనవరి 22 ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఉంటుందన్నారు. శ్రీరాముడు మానవాలికి ఆదర్శం. కరుణ, సోదర భావం, న్యాయంతో జీవించాలని నేర్పాడు. రాముడు కరుణాసాగరం. మనందరం ఈరోజు నుండి పాత వివక్ష, శత్రుత్వాన్ని వీడి కొత్త రోజును ప్రారంభించాలని కైలాష్ సత్యార్థి సూచించారు.

Next Story

Most Viewed