- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచంలోనే పవర్‌ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్ టెస్టు సక్సెస్: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్ టెస్టు సక్సెస్ అయిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. చెన్నయ్‌లో ఈ టెస్ట్ జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత రైల్వే తమ తొలి హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ కోచ్‌ను విజయవంతంగా టెస్ట్ చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. చెన్నయ్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఈ ప్రయోగం జరిగిందని ఆయన చెప్పారు.
‘తొలి హైడ్రోజన్ కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్)ను ఐసీఎఫ్‌లో విజయవంతంగా టెస్ట్ చేశాం. 1200 హార్స్ పవర్‌తో ప్రయాణించే హైడ్రోజన్‌ను భారత్ తయారు చేస్తోంది. ఇది మనల్ని హైడ్రోజన్ ట్రైన్ టెక్నాలజీ లీడర్లలో ఒకరిగా నిలబెడుతుంది’ అని అశ్వినీ వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
2013లోనే 35 హైడ్రోజన్ ట్రైన్లను ప్రారంభించాలని భారత రైల్వే అనుకుంటున్నట్లు రాజ్యసభలో వైష్ణవ్ చెప్పారు. దీనికోసం ఒక్కో రైలుకు రూ.80 కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక్కో మార్గానికి రూ.70 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తొలి హైడ్రోజన్ కోచ్‌ను రైల్వే శాఖ విజయవంతంగా టెస్ట్ చేయడం గమనార్హం.
ఇప్పటి వరకు కేవలం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా మాత్రమే హైడ్రోజన్ పవర్‌తో నడిచే ట్రైన్లను నడుపుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా కేవలం 500-600 హార్స్ పవర్‌తో నడిచేవే. భారత్ తయారు చేసిన ఇంజిన్ ఏకంగా 1200 హార్స్ పవర్‌తో నడిచేది కావడం విశేషం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ నాలుగు దేశాల సరసన భారత్ చేరుతుంది.






