గుజరాత్‌లో పోటి చేయొద్దని బీజేపీ ఆఫర్: అరవింద్ కేజ్రీవాల్

by Disha Web Desk 17 |
గుజరాత్‌లో పోటి చేయొద్దని బీజేపీ ఆఫర్: అరవింద్ కేజ్రీవాల్
X

గాంధీనగర్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తనకు పెద్ద ఎత్తున ఆఫర్ చేసిందని ఆరోపించారు. కేంద్ర సంస్థల దర్యాప్తుల్లో ఉన్న మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు ఆశ చూపిందని అన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన టౌన్ హాల్ కార్యక్రమంలో గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదన్ గద్వీతో కలిసి పాల్గొన్నారు.

మంత్రులు బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించడంతో గుజరాత్‌లో పోటీ చేయొద్దని తనను కోరినట్లు పేర్కొన్నారు. ఒకవేళ గుజరాత్ విడిచి వెళ్తే సత్యేందర్ జైన్, సిసోడియాలపై ఉన్న ఛార్జ్‌లను తొలగిస్తామని చెప్పారని తెలిపారు. అయితే బీజేపీ నేరుగా ఈ ఆఫర్ చేయకుండా.. ఇతరుల ద్వారా తనకు చేర్చిందని అన్నారు.

మార్పు రావాలి

ఓవైపు బీజేపీని విమర్శిస్తూనే కాంగ్రెస్‌ను కేజ్రీవాల్ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ బీజేపీకి భార్య లాగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 27 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్ర ప్రజలు అలసిపోయారని, మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుజరాత్‌లో ఆప్ నేతలను చర్చలకు రానివ్వకుండా టీవీ ఛానెళ్లను బీజేపీ బెదిరింపులకు గురి చేస్తోందని విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 5 లేదా తక్కువ సీట్లకే పరిమితం అవుతుందని చెప్పారు. తమ పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే విధానం చూస్తే బీజేపీ భయపడిందనే విషయం అర్థమవుతందని చెప్పారు.

గుజరాత్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామని కాషాయ పార్టీ భయపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులందరూ బీజేపీకి టచ్‌లో ఉన్నారని గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గద్వీ అన్నారు. వారికి కాషాయ పార్టీ నిధులు ఇస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ కు 22, బీజేపీకి 70 సీట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.

Read more :

1.ఈ ఓటు రాబోయే 25 ఏళ్లను నిర్ధారిస్తుంది: ప్రధాని మోడీ



Next Story

Most Viewed