కాస్త వయసు మీద పడగానే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి?

by Disha Web Desk 8 |
కాస్త వయసు మీద పడగానే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి?
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది కాస్త వయసు మీద పడగానే వారు అడిగే మొదటి ప్రశ్న? ఏంటో ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు అధికంగా అనిపిస్తున్నాయి. కాసేపు నడిస్తే చాలు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది? అసలు ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామో అని ముచ్చటిస్తారు. ప్రస్తుతం చాలా మంది ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కాస్త ఏజ్ మీద పడగానే ఎందుకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏమిటి? అయితే కాస్త వయసు పైబడగానే మోకాళ్ళ నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

వయసులో ఉన్నప్పటి నుంచి కొంచెం అజాగ్రత్తగా ఉండటం వలన వయసు మీద పడే కొద్ది అనారోగ్య సమస్యలు తీవ్రత ఎక్కువై మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే ఒత్తిడి , అధిక శరీర బరువు, ఊబకాయం, శరీర బరువు అంతా మోకాలి మీద పడటం, అతిగా నడవడం, అతిగా వ్యాయామం చేయడం, పరుగెత్తడం, కింద కూర్చుని లేవడం , మెట్లు ఎక్కడం, దిగడం ఇలాంటివి పనులు అతిగా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు వృద్ధ్యాప్యంలో వస్తాయంట. ఏజ్ పెరుగుతున్నా కొద్ది , వీటి తీవ్రత ఎక్కువగా ఉంటాయంట. అంతే కాకుండా చిన్న ప్పుడు సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నడక, శారీరక శ్రమ వ్యాయామం లేకపోవడం వలన కూడా మోకాళ్ల నొప్పుల వ్యాధులు వస్తాయంటున్నారు పలువురు. అలాగే మన శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా పేరుకపోయి, అది మన అవయవాలను బలహీనంగా మారుస్తుంది. దీని కారణం చేత శారీరక కదలిక అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందువలన అనారోగ్య సమస్యలు ఏర్పడి, మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి అంటున్నారు మరికొందరు. ముఖ్యంగా ఈ సమస్య మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుందంట. ఇక ఈ సమస్య ఉన్నప్పుడు మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం, ఉదయం వాకింగ్ చేయడం, రోజూ తాజా పండ్లు తినడం వలన దీని నుంచి కాస్త బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

Next Story