ఈ ఓటు రాబోయే 25 ఏళ్లను నిర్ధారిస్తుంది: Narendra Modi

by Disha Web Desk 17 |
ఈ ఓటు రాబోయే 25 ఏళ్లను నిర్ధారిస్తుంది: Narendra Modi
X

షిమ్లా: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ ప్రతి ఓటు రాబోయే 25 ఏళ్ల హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిని నిర్ధారిస్తుందని అన్నారు. బీజేపీతోనే అది సాధ్యపడుతుందని, తమకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. శనివారం ఆయన మండీ జిల్లాలో సురేంద్రనగర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.

'ఈసారి హిమాచల్ ఎన్నికలు ప్రత్యేకం ఎందుకంటే నవంబర్ 12న పోలైన ఓట్లు రానున్న ఐదేళ్లకు మాత్రమే కాదు.. రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని నిర్వచిస్తుంది' అని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితమే భారత్ 75 ఏళ్ల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుందని చెప్పారు. భారత్ శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే సమయానికి హిమాచల్ ప్రదేశ్ కూడా 100 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతుందని అన్నారు.

అందుచేత రాబోయే కాలం చాలా ముఖ్యమైనదని తెలిపారు. బీజేపీ స్థిరత్వం, సేవ, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుందని ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. అందుకే బీజేపీని తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని అన్నారు.

Read more :

1.మునుగోడు కౌంటింగ్ తక్షణమే నిలిపివేయండి...సాక్ష్యాలు ఉన్నాయంటూ మాజీ ఐఏఎస్ ఆకునూరి సంచలన డిమాండ్

Next Story