నటి ఫోన్ హ్యాక్ చేసి సీక్రెట్స్ బయటపెడతానంటూ బెదిరింపులు.. కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 6 |
నటి ఫోన్ హ్యాక్ చేసి సీక్రెట్స్ బయటపెడతానంటూ బెదిరింపులు.. కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. లేదా సోషల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేస్తూ.. నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, నటి దేవియని శర్మ ఫోన్ హ్యాక్ చేశారంటూ ఓ పోస్ట్ షేర్ చేయడంతో నెట్టింట దుమారం రేపుతోంది. ‘‘ కొన్ని రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. భయపెట్టాలని చూశారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలీదు కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నా.

ఇప్పుడు మళ్ళీ నా ఫోన్ లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. నా వాట్సాప్ హ్యాక్ అయిందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ నా నంబర్ నుచి ఎవరికైనా ఎలాంటి మెసేజ్ వచ్చినా అది నాది కాదు. ఇప్పటికే దీంతో మానసికంగా బాధపడుతున్నాను. మూడు సార్లు ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేను వ్యవస్థలను నమ్ముతాను. కేసుని ముందుకు తీసుకెళ్తాను. కాబట్టి నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ లు వచ్చినా అది నేను కాదు అని తెలుసుకోండి.

వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇది నా పరువు తీయడానికి, నన్ను చెడుగా ప్రమోట్ చేయడానికే చేస్తున్నట్టు ఉంది. మామూలుగానే ఒక ఆర్టిస్ట్ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతుంది’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా.. ఈ అమ్మడు ఇటీవల తెలుగులో పైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది.

Read More...

షూటింగ్‌లో పళ్లు.. కాలు విరగొట్టుకుని ఆసుపత్రి పాలైన హీరోయిన్.. పోస్ట్ వైరల్



Next Story