ఉత్తరాఖండ్‌లో మరోసారి కొండచరియల బీభత్సం

by Disha Web Desk 2 |
ఉత్తరాఖండ్‌లో మరోసారి కొండచరియల బీభత్సం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులకు మరోసారి కొండచరియలు తీవ్ర అంతరాయం కలిగించాయి. భారీగా కొండచరియలు విరిగిపడటంతో పితోరాగఢ్‌ జిల్లాలోని లఖన్‌పుర్ సమీపంలోని లిపులేఖ-తవఘాట్‌ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో, దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రయాణికుల రాకపోకల కోసం రెండు రోజుల తర్వాత ఈ రోడ్డును తెరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నవంబరు రెండోవారం వరకూ చార్‌ధామ్ యాత్ర ఉంటుంది. ఈ సమయంలో కొండచరియలు విరిగిపడటం యాత్రికులకు ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్మోరా, చమోలీ, చంపావత్‌, దేహ్రాదూన్‌, హరిద్వార్‌, గర్వాల్‌, నైనిటాల్‌, రుద్రప్రయాగ, తెహ్రీ గర్వాల్‌, పితోరాగఢ్‌, ఉద్దమ్‌ సింగ్ నగర్‌, ఉత్తరకాశీ జల్లాల్లో తుపాన్‌,ఉరుములతో కూడిన వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. అలాగే యాత్రికులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.



Next Story