ఫించన్ కోసం మండుటెండలో వృద్ధురాలి పాట్లు (వీడియో)

by Disha Web Desk 2 |
ఫించన్ కోసం మండుటెండలో వృద్ధురాలి పాట్లు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెబుతున్నా.. కొన్ని ఘటనలు అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందనేలా వెలుగుచూస్తున్నాయి. ఓ వృద్ధురాలు ఫించన్ కోసం మండుటెండలో కూర్చీ సాయంతో చెప్పుల్లేకుండా నడుచుకుంటూ వెళ్లిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 17న ఒడిశాలోని నబ్రంగ్‌పూర్ జిల్లా ఝరిగావ్ బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్య హరిజన్(70) అనే వృద్ధురాలు పింఛను కోసం మండుటెండలో..విరిగిన కూర్చీ సాయంతో చెప్పుల్లేకుండా బ్యాంకు బాట పట్టింది.

కానీ, ఆమె బొటనవేలు రికార్డులకు సరిపోలడం లేదని అధికారులు చెప్పడంతో ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. ఈ ఘటనపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజర్ స్పందిస్తూ, ఆమె వేళ్లు విరిగిపోవడంతో డబ్బును విత్‌డ్రా చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించడానికి బ్యాంక్ కృషి చేస్తోందని తెలిపారు. దీంతో ఆమెకు బ్యాంక్ మాన్యువల్‌గా ₹ 3,000 అందించింది. అయితే, ఫించన్ కోసం కిలోమీటర్ల మేర వృద్ధురాలు కాలినడకన వెళ్లడంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story