పౌరసత్వ చట్టంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
పౌరసత్వ చట్టంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పౌరసత్వ చట్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో ఎకనామిక్స్‌ టైమ్ నిర్వహించిన సదస్సులో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమలులోకి తీసుకొస్తామని ప్రకటించారు. చట్టం అమలుకు ముందు నిబంధనలు జారీ చేస్తామని తెలిపారు. ఫ్యామిలీ ప్లానింగ్‌ కుటుంబపరంగా బావుటుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పొత్తులపైనా అమిత్ షా స్పందించారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని తెలిపారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు బయటకు వెళ్లొచ్చు.. అయినా తమకేం నష్టం లేదని స్పష్టం చేశారు.

మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ కూటమికి సంపూర్ణ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, దేశంలో నివసించేందుకు హక్కున్న పౌరులెవరు, బయటివారెవరో గుర్తించేందుకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఉపయోగపడుతుంది. తాజాగా.. దీనిని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అదీ పార్లమెంట్ ఎన్నికలలోపే కావడం.. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది.


Next Story

Most Viewed