రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఫోన్‌లో అభినందించిన ప్రధాని మోడీ

by Dishanational1 |
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఫోన్‌లో అభినందించిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 'రష్యా ఫెడరేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు హృదయపూర్వకంగా అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో భారత్, రష్యా మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయడానికి అంగీకరించాం' అని ట్వీట్ చేశారు. ఫోన్ సంభాషణలో భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడంలో చర్చలు, దౌత్యమే ముందున్న మార్గమని మోడీ పునరుద్ఘాటించారని అధికారులు తెలిపారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరు దేశాల అధినేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, రష్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ వరుసగా ఐదవసారి ఘనవిజయం దక్కించుకున్నారు. దాదాపు 88 శాతం ఓట్లతో పుతిన్ గెలవడం విశేషం. 1999 నుంచి పుతిన్ ఒక్కసారిగా కూడా ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొనకపోవడం గమనార్హం.


Next Story