‘రిజర్వేషన్లు రద్దు’.. అమిత్‌షా ఫేక్ వీడియో గుర్తింపు.. కేసు నమోదు

by Dishanational4 |
‘రిజర్వేషన్లు రద్దు’.. అమిత్‌షా ఫేక్ వీడియో గుర్తింపు.. కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తాం’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పినట్టుగా ఉన్న ఫేక్ వీడియో వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దానిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియోను తయారు చేసి, వ్యాపింపజేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఫేక్ వీడియోను ఆదివారం రోజు జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఇది సర్క్యులేట్ అవుతోందని అంటున్నారు. ‘‘అధికారంలోకి రాగానే.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం. అవి రాజ్యాంగ విరుద్ధం’’ అని అమిత్ షా వ్యాఖ్యానించిన వీడియోను ఎడిట్ చేసి.. అందులో ‘‘ముస్లిం’’ అనే చోట ‘‘ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ’’ అనే పదాలు వచ్చేలా చేశారు. చాలామంది ఇలాంటి ఎడిట్ చేసిన ఫేక్ వీడియోలను కూడా నిజమైనవే అని భావిస్తుండటం గమనార్హం.

Next Story

Most Viewed