ఏపీలో ఆ పార్టీ విజయం ఖాయం..జోస్యం చెప్పిన పవన్ కళ్యాణ్

by Mamatha |
ఏపీలో ఆ పార్టీ విజయం ఖాయం..జోస్యం చెప్పిన పవన్ కళ్యాణ్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. అనంతరం గెలుపు ఓటములపై చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు మాదేంటు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. మంగళవారం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ మీడియాతో మాట్లాడారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమిదే గెలుపు తేల్చి చెప్పారు. ఏపీలో కూటమి విజయం ఖరారు అయ్యిందని, అందులో ఎలాంటి సందేహం లేదని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఈ క్రమంలో మూడోసారి ప్రధాని మోడీనే అవుతారని తేల్చి చెప్పారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా తాము ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రధానమంత్రిగా దేశాన్ని ముందుకు నడిపించిన మోడీ మళ్లీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా మోడీని ఎంతగానో అభిమానిస్తానని, మోడీ అంటే తనకు ఎంతో గౌరవమని స్పష్టం చేశారు.

Next Story