Loot Fuel: బోల్తా కొట్టిన ట్యాంకర్.. 20 వేల లీటర్ల డీజిల్ రోడ్డు పాలు.. ఇంధనం కోసం ఎగబడిన స్థానికులు

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలోన ఓ ఇంధన ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది.

Loot Fuel: బోల్తా కొట్టిన ట్యాంకర్.. 20 వేల లీటర్ల డీజిల్ రోడ్డు పాలు.. ఇంధనం కోసం ఎగబడిన స్థానికులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని (Sonbhadra) సోన్‌భద్రలోన ఓ ఇంధన ట్యాంకర్ (fuel tanker) అదుపు తప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. దీంతో దాదాపు 20 వేల లీటర్ల డీజిల్ రోడ్డు పాలు అయింది. దీంతో స్థానికులు డీజిల్ ఎత్తుకెళ్లడానికి ఎగబడ్డారు. అయితే ఈ క్రమంలోనే ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు డ్రైవర్‌కు, ప్రమాద బాధితులకు సహాయం చేయకుండా రోడ్డుపై పారుతున్న డీజిల్‌ను అందిన కాడికి చేతులతో తోడుకొని వెళ్లిపోయారు. డీజిల్ కోసం బాటిళ్లు, బకెట్లు వంటి వాటిని తీసుకుని వచ్చి రోడ్డుపై పారుతున్న డీజిల్‌ను నింపుకోని స్థానికులు ఉడాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మేరకు నెటిజన్‌లు రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. ప్రజలకు ఉచితంగా విషం దొరికిన వారు దానిని వదిలిపెట్టరని, అది ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందని నమ్ముతారని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా వచ్చింది. కొంత మంది ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కాగా, మార్కుండి వ్యాలీలో జరగిన ఈ ట్యాంకర్ బోల్తా ఘటనలో డ్రైవర్‌, క్లినర్‌కు గాయాలైనట్లు తెలిసింది. వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోని క్రేన్‌తో ట్యాంకర్‌ను తొలగించారు. రోడ్డుపై పారిన డీజిల్‌తో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా అగ్నిమాపక సిబ్బంది నీటితో శుభ్రం చేసి క్లియర్ చేశారు.

Next Story