- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US: అమెరికాలో 8 రోజుల్లో 3 విమాన ప్రమాదాలు..84 మంది మృతి
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. గత ఎనిమిది రోజుల్లో మూడు ప్రమాదాలు జరగగా.. 84 మంది చనిపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. గత ఎనిమిది రోజుల్లో మూడు ప్రమాదాలు జరగగా.. 84 మంది చనిపోయారు. పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనా లో పైలట్‌తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమానం శిథిలాలను సముద్రంలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర్నో రెస్క్యూ టీం తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. టేకాఫ్ అయిన గంటలోపే విమానం ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కోల్పోయిందని అధికారులు చెప్పారు.
అసలేం జరిగిందంటే?
అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం, బెరింగ్ ఎయిర్‌కు చెందిన సెస్నా కారవాన్ అనే విమానం గురువారం ఉనల్కలేట్ నుంచి నోమ్ నగరానికి బయలుదేరింది. ఆ విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులతో పాటు పైలట్ ఉన్నారు. అయితే, ప్రతికూల వాతావరణం వల్ల విమాన ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో హిమపాతం, పొగమంచు ప్రభావం అధికంగా ఉండటంతో పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. విమానం ప్రమాదానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఇకపోతే, జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొని 67 మంది ప్రాణాలు కోల్పోయారు. జనవరి 31న ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. ఇక, ప్రస్తుతం అలాస్కాలో ఈ ప్రమాదం జరిగింది.






