- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
West Bengal: వక్ఫ్ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఉత్తర బెంగాల్.. 150 మంది అరెస్టు
బెంగాల్‌లోని ముర్షీదాబాద్, హుగ్లీ, మాల్దా, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో ఆందోళనలు ఊహించని స్థాయిలో కొనసాగుతున్నాయి

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలతో అటుడుకుతోంది. పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా, 150 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికే వక్ఫ్ బిల్లు పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారింది. అయితే, దీనిపై ఇంకా వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఈ బిల్లు మరింత వాదాస్పదంగా మారింది. గత శుక్రవారం నుంచి బెంగాల్‌లోని ముర్షీదాబాద్, హుగ్లీ, మాల్దా, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో ఆందోళనలు ఊహించని స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో సుతి, ధులియన్, సంసెర్‌గంజ్, జంగీపూర్ ఉన్నాయి. పరిస్థితులు అదుపు తప్పడంతో కేంద్ర బలగాలు కూడా దిగాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. కేంద్ర బలగాలు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తుండగా, ప్రజల భద్రత ప్రమాదంలో ఉన్నప్పుడు న్యాయస్థానాలు మాటలు రాని ప్రేక్షకులుగా ఉండవని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం సుతి, ధులియన్, సంసెర్‌గంజ్, జంగీపూర్ ప్రాంతాల్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. తాజా పరిణామాలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శాంతి భద్రతల కోసం విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు తమ లబ్ది కోసమే అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అయితే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదని ఆరోపించారు. 400 మందికి పైగా హిందువులు తమ ఇళ్లను వదిలి పారిపోయేలా చేశారని విమర్శించారు.






