Flash Floods: ఆకస్మిక వరదలు.. 117 మంది మృతి

by Naga Rani Yarlagadda |

నైజీరియాలో వరదలు (Nigeria Floods) బీభత్సం సృష్టించాయి. నైజర్ రాష్ట్రంలోని (Niger State) మార్కెట్ పట్టణం మోక్వాలో వరదల కారణంగా ఇప్పటి వరకూ 117 మంది మరణించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Flash Floods: ఆకస్మిక వరదలు.. 117 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నైజీరియాలో వరదలు (Nigeria Floods) బీభత్సం సృష్టించాయి. నైజర్ రాష్ట్రంలోని (Niger State) మార్కెట్ పట్టణం మోక్వాలో వరదల కారణంగా ఇప్పటి వరకూ 117 మంది మరణించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదలపై నైజర్ రాష్ట్ర రాజధాని మిన్నాలోని ఆపరేషన్స్ కార్యాలయ అధిపతి హుస్సేని ఇసా మాట్లాడుతూ.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అనేకమంది ప్రమాదంలో ఉన్నారని తెలిపారు. తాజా నివేదిక ప్రకారం వరదల్లో 117 మంది మరణించారని పేర్కొన్నారు.

నైజర్లో గంటల తరబడి వర్షం కురవడంతో వరదలు సంభవించాయని స్థానిక మీడియా తెలిపింది. జనజీవనాన్ని వరదలు ప్రభావితం చేశాయి. అనేక ఇళ్లు నీట మునగడంతో వేలాది మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ప్రభుత్వం వారికి ఆహార పొట్లాలు, చిన్నపిల్లలకు పాలు సరఫరా చేస్తోంది. పట్టణంలో ఉన్న ఆనకట్ట విరిగిపోవడంతో గత సెప్టెంబర్లో సంభవించిన వరదలే వచ్చాయి. 2024లో సంభవించిన వరదల్లో 1200 మందికి పైగా మరణించగా.. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దశాబ్దాల కాలంలో దేశంలో సంభవించిన అత్యంత దారుణమైన వరదలని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. కాగా.. మరో 36 రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని నైజీరియా వాతావరణ సంస్థ హెచ్చరించింది.

Next Story