- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వినాయక మండపం వద్ద విషాదం.. తల్లి ఒడిలోనే బాలుడి మృతి
వినాయక మండపం వద్ద తల్లి ఒడిలోనే కొడుకు మరణించిన విషాదకర సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వినాయక మండపం వద్ద తల్లి ఒడిలోనే కొడుకు మరణించిన విషాదకర సంఘటన మహారాష్ట్రలో జరిగింది. సెప్టెంబర్ 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొల్హాపూర్లోని కోడోలి గ్రామంలో వినాయకుడి మండపం వద్ద శ్రావణ్ (10) తన స్నేహితులతో ఆడుకుంటూ.. స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కాస్త అన్ ఈజీగా అనిపించడంతో మండపం పక్కనే ఉన్న తన ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకున్నాడు. కొడుకు నిద్రపోతున్నాడని అనుకున్న తల్లికి కడుపుకోత మిగిలింది. గుండెపోటు బాలుడిని మృత్యు ఒడికి చేర్చింది. నిద్రలోనే బాలుడు గుండెపోటుతో చనిపోగా.. చాలాసేపు అతడిని మేల్కొలిపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు నిర్థారించారు. కళ్లెదుటే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఎప్పుడు ఆరోగ్యంగా, చలాకీగా తిరుగుతూ ఉండే శ్రావణ్ గుండెపోటుతో మరణించడం కుటుంబీకులను, స్థానికులను కలచివేసింది. కాగా.. ఇటీవల కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. మన ఆహారశైలే ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నా.. క్వాలిటీ లేని ఆహారం తినడం, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడటం వల్లే అనారోగ్యం చుట్టుముడుతోంది.






