జూలైలో కరోనా పెను విధ్వంసం : మోడీ

by  |
జూలైలో కరోనా పెను విధ్వంసం : మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్:
జూలై నెలలో కరోనా ముప్పు అధికంగా ఉంటుందని, దేశ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. మంగళవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన మన దేశంలో కరోనా మరణాలు నిలకడగానే ఉన్నాయని వివరించారు.అన్ లాక్ 1.0లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే కేసుల సంఖ్య పెరిగిందన్నారు.

ఇప్పుడు మనం అన్ లాక్ 2.0లో ప్రవేశిస్తున్నాం కావున దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.లాక్ డౌన్ నిబంధనలు గ్రామసర్పంచ్ నుంచి దేశ ప్రధాని వరకు అందరూ పాటించాల్సిందేనని మోడీ స్పష్టం చేశారు. కంటైన్ మెంట్ జోన్ల మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజలందరూ కూడా కలసికట్టుగా పనిచేసి దేశ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అంతే కాకుండా భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరిగా వినియోగించి, కరోనాను తరలిమేయాలన్నారు.

రానున్నది పండుగల సీజన్ కావడంతో పేదలెవరూ పస్తులతో ఉండకుండా ప్రధాని గరీబ్ అన్నయోజన కింద దేశంలో 80కోట్ల మందికి పైగా నవంబర్ నెల వరకు ఫ్రీ రేషన్ ఇవ్వనున్నామని తెలిపారు. అందుకోసం రూ.90వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డుతో పేదలకు లబ్ధి జరుగుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతినెలా 5కిలోల బియ్యం, కిలో శనగలు పంపిణీ చేస్తామన్నారు.


Next Story

Most Viewed