రెచ్చిపోయిన దొంగలు.. నర్సాపూర్ ఇండియా బ్యాంకులో భారీ చోరీ

69

దిశ, నర్సాపూర్ : ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో గల ఇండియా బ్యాంకులో దొంగతనం జరిగింది. పోలీసులు, బ్యాంక్ మేనేజర్ కథనం ప్రకారం.. నర్సాపూర్ పట్టణంలోని ఇండియా బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి వెనక గల కిటికీ పగలగొట్టి బ్యాంకులో ప్రవేశించారని తెలిపారు. బ్యాంకులో చెక్కులు భద్రపరిచే బాక్సును ఎత్తుకెళ్లినట్టు వివరించారు.

గురువారం ఉదయం బ్యాంక్‌కు వెళ్ళిన మేనేజర్ తాళాలు తెరిచి చూసేసరికి అందులోని సామగ్రి చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్టు చెప్పాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నర్సాపూర్ ఎస్ఐ గంగరాజు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..