బొమ్మల తయారీలో స్వయం సమృద్ధత సాధించాలి: మోడీ

57

న్యూఢిల్లీ: బొమ్మల తయారీలో భారత్ స్వయం సమృద్ధతను సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పర్యావరణాన్ని, మానసిక స్థితిని సంతులనం చేసేలా ఈ బొమ్మలుండాలని సూచించారు. దేశంలోనే తొలి బొమ్మల మేళాను ప్రధానమంత్రి మోడీ శనివారం ప్రారంభించారు. ఈ బొమ్మల ప్లాస్టిక్ స్వల్పంగా వినియోగించాలని, పునర్వినియోగించే పదార్థాలనూ ఎన్నుకోవాలని సూచించారు. ‘మనదేశంలో తయారైన బొమ్మలు భారతీయుల జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. వస్తువులను పునర్వినియోగించే సంప్రదాయం ఇక్కడ ప్రబలంగా ఉంటుంది. ఇదే సంస్కృతి మన బొమ్మలను కనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ మేళాను వర్చువల్ కాన్ఫరన్స్‌లో ప్రారంభించి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్లస్టర్లతో సంభాషించారు. భారత బొమ్మల తయారీ పరిశ్రమను మరింత వృద్ధి చేయాలని, కర్ణాటకలోని టాయ్ క్లస్టర్ చన్నపట్నానికి చెందిన విభాగాన్ని కోరారు. చన్నపట్న దాదాపు 200 ఏళ్లుగా బొమ్మలను తయారుచేస్తున్నది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..