నాగులచవితి పర్వదినం విశిష్టత ఇదే!

by  |

నమస్తే దేవ దేవేశ !
నమస్తే ధరణీధర !
నమస్తే సర్వ నాగేంద్ర !
ఆదిశేష నమోస్తుతే! అని
నాగులచవితి నాడు
నాగదేవతకు పుట్టలో
పాలుపోసి పూజించిన
వారికి పుణ్యం దక్కును

ప్రకృతిలోని సమస్త
ప్రాణకోటి దైవస్వరూపాలే
సూర్యచంద్ర నక్షత్రాలు
నదులు పర్వతాలు సప్తసముద్రాలు
రాయి రప్ప కొండ కోన చెట్టు పుట్ట
ఇదే మన భారతీయ సంస్కృతి

రైతుల పంటలకు
శత్రువులు క్రిమికీటకాలు
వాటికి శత్రువులు మన నాగదేవతలు
రాత్రిపూట రైతుల పంటపొలాలని
పహారాకాస్తూ పంటలను ధ్వంసంచేసే
క్రిమికీటకాదుల్ని మట్టుపెట్టే వీరసైనికులే
పుట్టలోని మన నాగదేవతలు

ఇంటికి శతృవు ఓ అగ్గికణం
అడవికి శతృవు కార్చిచ్చు
మనిషి శరీరానికి
శతృవులు నయంకాని
మొండి వ్యాధులు
మన అంతరంగాన్ని
అల్లకల్లోలం చేసి మనిషిని
మానసిక వ్యాధులకు
మనోవేదనలకు గురిచేసే
అంతర్గత శతృవులే అరిషడ్వర్గాలు

మన దేహం ఎముకల గుట్ట
మన అంతరంగం పాముల పుట్ట
మనలోని ఆ విషసర్పాలే
కామం… క్రోధం…లోభం…
మోహం… మదం… మాత్సర్యం
అవి సత్త్వగుణాన్ని హరించేస్తాయి
రజో తమోగుణాలను రగిలించేస్తాయి

ఈ విషసర్పాలే శ్వేతవర్ణంలో
ఆదివిష్ణువు పవళించే
శేషపాన్పూగా మారాలని
మనుషులంతా
సుఖశాంతులతో వర్థిల్లాలని
వారికి ప్రశాంతమైన
జీవితాలను ప్రసాదించాలని
పుట్టలో పాలుపోసి చేసే
పూజే ఈ నాగులచవితి పర్వదినం…

రచన.పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్. – 9110784502
Email- kpl9711@gmail.com
Address: Attapur Hyderabad.48

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed