కాలుష్య నివారణకు.. పచ్చదనాన్నిపెంపొందించాలి

by  |
కాలుష్య నివారణకు.. పచ్చదనాన్నిపెంపొందించాలి
X

దిశ, ముషీరాబాద్: కాలుష్య నివారణకు పచ్చదనాన్నిపెంపొందించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రజలు స్వచ్ఛందంగా కృషి చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కవాడిగూడ డివిజన్‌లోని రోటరీ కాలనీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ లాస్య నందితతో కలిసి మొక్కలు నాటారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తాచెదారాన్ని సిబ్బంది చేత తొలగించారు. అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలకు ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటి చెట్లను కాపాడాలని ఆయన తెలిపారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టటానికి మొక్కలు నాటడమే ఏకైక మార్గం అనివివరించారు. అలాగే ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్‌లో అరుణ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. శాంతిభద్రతలు కాపాడడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతిఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.

Next Story