- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పు ఇచ్చిన సొమ్ము అడిగినందుకు హత్య…
<p>దిశ, అల్వాల్ : తన గుడిసెలో నిద్రిస్తున్న మహిళను హత్యచేసిన కేసు మిస్టరీ వీడింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమన్నందుకే ఆమెను హత్యచేసినట్లు అల్వాల్ఇన్స్పెక్టర్గంగాధర్శనివారం నిందుతుల వివరాలు వెల్లడించారు. వెంకటాపురం ప్రాంతంలో నివాసం ఉంటున్న పూలమ్మ(40) గత నెల 26న దారణ హత్యకు గురైంది. అయితే హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్క పోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. విచారణలో భాగంగా మృతురాలుకు సన్నిహితంగా ఉండే వారిని విచారిస్తున్న క్రమంలో బాధితురాలి వద్ద […]</p>

దిశ, అల్వాల్ : తన గుడిసెలో నిద్రిస్తున్న మహిళను హత్యచేసిన కేసు మిస్టరీ వీడింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమన్నందుకే ఆమెను హత్యచేసినట్లు అల్వాల్ఇన్స్పెక్టర్గంగాధర్శనివారం నిందుతుల వివరాలు వెల్లడించారు. వెంకటాపురం ప్రాంతంలో నివాసం ఉంటున్న పూలమ్మ(40) గత నెల 26న దారణ హత్యకు గురైంది.
అయితే హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్క పోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. విచారణలో భాగంగా మృతురాలుకు సన్నిహితంగా ఉండే వారిని విచారిస్తున్న క్రమంలో బాధితురాలి వద్ద అప్పుగా తీసుకున్న ముగ్గురి వ్యక్తులపై అనుమానం రావడంతో వారికదిలికలపై నిఘాపెట్టారు పోలీసులు.
వారిని శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేసినందుకే ఆమెను హత్యచేశారని అదే ప్రాంతంలో నివాసం ఉండే ముగ్గురు నిందితులు సాయిలు, మంజుల, వినోద కలిసి పథకం ప్రకారం హత్యచేసినట్లు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డుతో సహా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలసులు తెలిపారు.






