ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బీభత్సం .. పారాచూట్‌తో మైదానంలోకి..!

by  |
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బీభత్సం .. పారాచూట్‌తో మైదానంలోకి..!
X

దిశ, స్పోర్ట్స్: యూరో కప్‌లో భాగంగా ఫ్రాన్స్, జర్మనీ దేశాల మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక పారాగ్లైడర్ స్టేడియం మధ్యలోకి ఎగురుకుంటూ వచ్చి గందరగోళం సృష్టించాడు. స్పైడర్ కామ్‌ను తన మోటార్ గ్లైడర్‌తో ఢీకొట్టడమే కాకుండా ఇద్దరు ప్రేక్షకులకు గాయాలయ్యేలా బీభత్సం సృష్టించాడు. పర్యావరణ పర్యవేక్షణ కోసం కృషి చేస్తున్న గ్రీన్ పీస్ అనే సంస్థకు చెందిన కార్యకర్తే ఇలా చేశాడని గుర్తించి మ్యూనిచ్ పోలీసులు సదరు ఆందోళనకారుడితోపాటు గ్రీన్ పీస్ సంస్థపై కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై గ్రీన్ పీస్ సంస్థ స్పందించింది. ‘ఆటను ఆటంక పరచడం మా ఉద్దేశం కాదు. ఇలాంటి చవకబారు ఆందోళన కూడా చేయాలని అనుకోలేదు. ఆట జరుగుతున్న సమయంలో పారాచ్యూట్ ద్వారా స్టేడియంపైన ఎగిరి ఒక లేటెక్స్ బంతిని మధ్యలోకి విసరాలని అనుకున్నాము. ఆ బంతిపై తమ నిరసన నినాదాలు రాశాము. అయితే పారాగ్లైడర్ అనుకోకుండా స్టేడియం పైన అమర్చిన కెమేరాకు చిక్కుకొని పోయి కింద పడ్డాడు. అందుకు మేము క్షమాపణలు చెబుతున్నాము’ అని గ్రీన్ పీస్ సంస్థ చెప్పింది. కాగా ఈ ఘటనపై మ్యూనిచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed