పవన్ కళ్యాణ్ గురించి రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్.. ఏది మాట్లాడినా తప్పే అంటూ వార్నింగ్!

by Samataha |
పవన్ కళ్యాణ్ గురించి రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్.. ఏది మాట్లాడినా తప్పే అంటూ వార్నింగ్!
X

దిశ, సినిమా : రేణు దేశాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బద్రీ సినిమాలో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ నటి, పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తనతో ప్రేమ అనంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అకిరా, ఆద్య. పిల్లలతో కొన్ని రోజులు సంతోషంగా ఉన్న ఈ జంట తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంకో పెళ్లి చేసుకొని భార్యతో ఉండగా, రేణు దేశాయ్ మాత్రం తన ఇద్దరు పిల్లలను తానే పెంచుకుంటూ ఒంటరిగా ఉంటుంది. అయితే చాలా కాలం తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్న ఈ నటి, ఈ మధ్య మళ్లీ తెలుగు అభిమానులకు దగ్గరైంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన పిల్లల గురించి, తన గురించి అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అంతే కాకుండా పలు షోలు, సిరీస్‌లలో కూడా ఈ నటి కనిపిస్తోంది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం వారితో నేను చాలా సరదాగా గడుపుతాను అని చెప్పుకొచ్చింది. ఇక నా కెరీర్ గురించి నేను ఆలోచించను. ప్రతి ఒకరి రిలేషన్ షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకరు ఏడుస్తూనే ఉన్నారు. నేను ఏమీ స్పెషల్ కాదు, నా ఒక్కదానికి మాత్రమే కష్టాలు లేవు అంటూ తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి నన్ను ఏం అడుగొద్దు. ఎందుకంటే ఆయన గురించి ఏమీ మాట్లాడినా దానిని తప్పుగానే రాస్తున్నారంటూ వార్నింగ్ ఇచ్చింది. నేను ఒకటి చెపితే, ఆ ఇంపార్టెంట్ వదిలేసి, చిన్న చిన్న విషయాలను వైరల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed