లంకన్ ప్రీమియర్ లీగ్‌లోకి మునాఫ్

by  |
లంకన్ ప్రీమియర్ లీగ్‌లోకి మునాఫ్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ (IPL) తప్ప ఇతర ప్రైవేట్ లీగ్స్‌ (Private leagues)లోకి భారతీయ క్రికెటర్లు వెళ్లడం అరుదు. అయితే ఇటీవల బీసీసీఐ (BCCI) ఎన్‌వోసీలు జారీ చేస్తుండటంతో కొంత మంది ఇతర క్రికెట్ లీగ్స్‌లో అడుగుపెడుతున్నారు. ప్రవీణ్ థాంబే సీపీఎల్‌లో ట్రిన్‎బాగో నైట్ రైడర్స్ (Trin Bago Knight Riders) తరపున ఆడుతున్నాడు. తాజాగా టీం ఇండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ కూడా ఇతర లీగ్స్ వైపు దృష్టి సారించాడు.

త్వరలో జరగబోయే లంకన్ ప్రీమియర్ లీగ్‌ (Lankan Premier League) వేలానికి మునాఫ్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తున్నది. అక్టోబర్ 1న జరిగే వేలంలో 150 మంది విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. మునాఫ్ పటేల్‌తో పాటు షాహిద్ అఫ్రీది, రవి బొపారా, షకీబుల్ హసన్, డారెన్ బ్రావో, కొలిన్ మున్రో, వెర్నార్ ఫిలాండర్, క్రిస్ గేల్, డారెన్ సామి వేలంలో పాల్గొనబోతున్నారని సమాచారం.

నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6 వరకు ఐదు ఫ్రాంఛైజీలతో ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించాలని శ్రీలంక దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతీ జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు, 13 మంది స్వదేశీయులతో మొత్తం 19 మంది చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. లంకన్ ప్రీమియర్ లీగ్‌ను కూడా బయోబబుల్ (Bio Bubble) వాతావరణంలో నిర్వహించనున్నారు.

Next Story