యాదవ్ కొట్టాడు.. ముంబై గెలిచింది

by  |
యాదవ్ కొట్టాడు.. ముంబై గెలిచింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 48వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన పోరులో ముంబై అనూహ్యంగా గెలిచింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో 166 పరుగులు చేశారు. దీంతో 5 వికెట్ల తేడాతో బెంగళూరు పై ముంబై గెలుపొందింది.

ముంబై ఇన్నింగ్స్:
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు డీకాక్ (18), ఇషాన్ కిషన్ (25) పరుగులు చేసి వెనుదిరిగినా.. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వన్ మ్యాన్ ఆర్మీలా చెలరేగిపోయాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ముంబై విజయం లాంఛనమైంది. మిడిలార్డర్‌లోనే వచ్చిన బ్యాట్స్‌మెన్లు సౌరబ్ తివారి (5), కృనాల్ పాండ్యా (10), హార్దిక్ పాండ్యా(17) పరుగులకే ఔట్ అయ్యారు. అయినప్పటికీ తొలి నుంచి మంచి ఫామ్ కొనసాగించిన సూర్యకుమార్ యాదవ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

బెంగళూరు ఇన్నింగ్స్:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యావరేజ్ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (74), జోష్ ఫిలిప్ప్ (33) పరుగులతో రాణించారు. కానీ, మిగతా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలం అయ్యారు. కెప్టెన్ కోహ్లీ(9), మిస్టర్ 360 (15) పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు కూడా నిలదొక్కుకోవడం కష్టతరం అయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లతో 6 వికెట్ల నష్టానికి RCB 164 పరుగులకే పరిమితం అయింది. బెంగళూరు జట్టులో ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ చెలరేగాడు. 45 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 74 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ చేశాడు.

స్కోరు బోర్డు:

Royal Challengers Bangalore Innings164-6 (20 Ov)

1. జోష్ ఫిలిప్ప్ (wk)st డీకాక్ b రాహుల్ చాహర్ 33(24)
2. దేవదత్ పడిక్కల్ c బోల్ట్ b బుమ్రా 74(45)
3. విరాట్ కోహ్లీ (c)c సౌరబ్ తివారి b బుమ్రా 9(14)
4. ఏబీ డివిలియర్స్ c రాహుల్ చాహర్ b పొలార్డ్ 15(12)
5. శివందూబే c సూర్యకుమార్ యాదవ్ b బుమ్రా 2(6)
6. క్రిస్ మోరిస్ c జేమ్స్ పాటిన్సన్ b బోల్ట్ 4(2)
7. గురుకీరత్ సింగ్ మన్ నాటౌట్ 14(11)
8. వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 10(6)

ఎక్స్‌ట్రాలు: 3

మొత్తం స్కోరు: 164-6

వికెట్ల పతనం: 71-1 (జోస్ ఫిలిప్ప్, 7.5), 95-2 (విరాట్ కోహ్లీ, 11.2), 131-3 (ఏబీ డివిలియర్స్, 15.2), 134-4 (శివం దూబే, 16.3), 134-5 (దేవదత్ పడిక్కల్, 16.5), 138-6 (క్రిస్ మోరిస్, 17.2)

బౌలింగ్:
1. ట్రెంట్ బోల్ట్ 4-0-40-1
2. జస్ప్రీత్ బుమ్రా 4-1-14-3
3. కృనాల్ పాండ్యా 4-0-27-0
4. జేమ్స్ ప్యాటిన్సన్ 3-0-35-0
5. రాహుల్ చాహర్ 4-0-43-1
6. కీరన్ పొలార్డ్ (c) 1-0-5-1

Mumbai Indians Innings: 166-5 (19.1 Ov)

1. క్వింటన్ డీకాక్ (wk)c గురుకీరత్ సింగ్ b సిరాజ్ 18(19)
2. ఇషాన్ కిషన్ c క్రిస్ మోరిస్ b చాహల్ 25(19)
3. సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 79(43)
4. సౌరబ్ తివారి c దేవదత్ పడిక్కల్ b సిరాజ్ 5(8)
5. కృనాల్ పాండ్యా c క్రిస్ మోరిస్ b చాహల్ 10(10)
6. హార్దిక్ పాండ్యా c సిరాజ్ b క్రిస్ మోరిస్ 17(15)
7. కీరన్ పొలార్డ్ నాటౌట్ 4(1)

ఎక్స్‌ట్రాలు: 8

మొత్తం స్కోరు: 166-5

వికెట్ల పతనం: 37-1 (క్వింటన్ డీకాక్, 5.3), 52-2 (ఇషాన్ కిషన్, 7.5), 72-3 (సౌరబ్ తివారి, 10.4), 107-4 (కృనాల్ పాండ్యా, 13.5), 158-5 (హార్దిక్ పాండ్యా, 18.5)

బౌలింగ్:
1. క్రిస్ మోరిస్ 4-0-36-1
2. డేల్ స్టెయిన్ 4-0-43-0
3. వాషింగ్టన్ సుందర్ 4-0-20-0
4. మహ్మద్ సిరాజ్ 3.1-0-28-2
5. యూజువేంద్ర చాహల్ 4-0-37-2


Next Story

Most Viewed