అందాల పోటీల్లో.. కిరీటం ‘కిరి కిరి’

121

దిశ, వెబ్‎డెస్క్ : అందమైన మోడల్ భామలకు మిస్ వరల్డ్ కావాలనే ఆశ చాలానే ఉంటుంది. అయితే అలాంటి ఓ మోడల్ కు మిసెస్ శ్రీలంక 2021 అందాల పోటీల్లో చేదు అనుభవం ఎదురైంది. వేదికపై నిర్వాకులు మిసెస్ శ్రీలంక విజేతను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు… పోటీలకు వచ్చిన వారిలో ఇద్దరినీ ఎంపిక చేశారు… కౌంట్ డౌన్ మొదలయ్యింది…విజేత గా పుష్పికా డి సిల్వాగా ప్రకటించారు. అయితే ఇక్కడే వచ్చింది అసలు కిరి..కిరి.. విజేతగా ప్రకటించిన పుష్పికా డి సిల్వాకు తలపై కిరీటం అలంకరించగా, మరోసారి ర్యాంప్‌వాక్‌ చేసి ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతలో హడావుడిగా అక్కడికి వచ్చిన మాజీ విన్నర్‌ కరోలిన్‌ జూరీ ఒక్కసారిగా సిల్వా కిరీటాన్ని తీసేసి, పక్కనే నిల్చుని ఉన్న మొదటి రన్నరప్‌నకు అలకరించారు.

ఈ క్రమంలో సిల్వా జుట్టు మొత్తం చెదిరిపోయింది. కరోలిన్‌ ప్రవర్తనతో ఖంగుతిన్న సిల్వా అక్కడి నుంచి అవమానభారంతో వేదిక దిగి వెళ్లిపోయారు. ఈ విషయం గురించి కరోలిన్‌ వివరణ ఇస్తూ.. ‘‘వివాహితలకు మాత్రమే విజేతగా నిలిచే హక్కు ఉంటుంది. విడాకులు తీసుకున్న వారికి కాదు’’ అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన సిల్వా “నేను విడాకులు తీసుకోలేదని, నాపై నిందలు వేసిన వారే నా విడాకుల పత్రాలు చూపించాలని” డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మిసెస్‌ శ్రీలంక వరల్డ్‌ నేషనల్‌ డైరెక్టర్‌ చండీమాల్‌ జయసింఘే, తొలుత విజేతగా ప్రకటించిన మహిళకే కిరీటం దక్కుతుందని స్పష్టం చేయడంతో గొడవ సద్దుమణిగింది. ఈ పరిణామాలపై అందాల పోటీ నిర్వాహకులు స్పందిస్తూ.. డి సిల్వానే విజేత అని మరోసారి ప్రకటించారు.

https://www.youtube.com/watch?v=S5rTt60PT90&t=48s  

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..