తప్పదు భారీ మూల్యం.. ఎన్నికల వేళ కరోనాను లెక్కచేయని స్థానిక నేతలు

by  |
తప్పదు భారీ మూల్యం.. ఎన్నికల వేళ కరోనాను లెక్కచేయని స్థానిక నేతలు
X

దిశ, నర్సాపూర్: ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యాదవ రెడ్డి అత్యధికంగా ఐదు వందల మెజార్టీతో గెలుపొందుతారని, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు నర్సాపూర్ పట్టణంలో ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామమాత్రపు పోటీనే అని తెలిపారు. ఎన్నికలలో ఓటు వేసే వారు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు తూచా తప్పకుండా పాటించి తమ పార్టీ అభ్యర్థి యాదవ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని తెలిపారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, జాయింట్ కలెక్టర్ రమేష్‌లు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటించలే

ఎన్నికల కేంద్రం వద్ద కరోనా నిబంధనలు పాటించలేదు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్‌లు కరోనా నిబంధనలు గాలికొదిలేసి తమ ఇష్టానుసారంగా గుంపులుగుంపులుగా ఒకే దగ్గర కూర్చోవడం గమనార్హం. ప్రజా ప్రతినిధులు ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని సామాన్య జనాలు చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed