శాస్త్రోక్తంగా భూమిపూజ.. భక్తితో పాల్గొన్న రాజకీయ నాయకులు

58

దిశ, మియాపూర్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడ, అభయాంజనేయ స్వామి దేవాలయ పునఃనిర్మాణ భూమిపూజ కార్యక్రమం గురువారం జరిగింది. శ్రీ తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఈ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, కార్పొరేటర్లు పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పునఃనిర్మాణం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా త్వరితగతిన నిర్మాణం పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వినోద్ రావు, హరీష్ వాలా, శ్రీనివాస్ గౌడ్, ప్రసాద్, మల్లేష్, ఆంజనేయులు, జనార్ధన్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..