మంత్రి కేటీఆర్ రాజీనామా లేఖతో రా.. నేను నిరూపిస్తా : ఎంపీ అర్వింద్

by  |
మంత్రి కేటీఆర్ రాజీనామా లేఖతో రా.. నేను నిరూపిస్తా : ఎంపీ అర్వింద్
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రం చెల్లించే పన్నుల వాటా కంటే ఎక్కువే కేంద్రం తెలంగాణకు ఇస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌పై ఎంపీ అర్వింద్ స్పందించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. రాజీనామా లేఖతో చర్చకు రండి, లేదా రాజీనామా చేసి రాష్ట్రం విడిచి వెళ్లిపోండి.. అని మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ధాన్యం మేమే కొనుగోలు చేస్తున్నామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.

దొడ్డు బియ్యం కొనమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని, ప్రజలను మంత్రి హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బియ్యం సేకరణ కోసం ప్రతి పైసాను ఇప్పటివరకు కేంద్రమే ఇచ్చిందని తెలిపారు. వేరుశనగ, పొద్దు తిరుగుడు, సోయా, చెరుకు వంటి పంటలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో కనపడకుండా పోయాయని విమర్శించారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం వరి తప్ప మరో పంట లేకుండా చేసిందని ఎంపీ ఫైర్ అయ్యారు.


Next Story

Most Viewed