- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శర్వానంద్-శ్రీను వైట్ల సినిమాలో క్రేజీ హీరోయిన్ ఫిక్స్.. హిట్ ఖాయం అంటున్న నెటిజన్లు
చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) ఒకేఒక జీవితం, మనమే వంటి సినిమాలతో ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు.

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) ఒకేఒక జీవితం, మనమే వంటి సినిమాలతో ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం శర్వానంద్ ఎలాగైనా హిట్ కొట్టాలని వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. త్వరలో ‘బైకర్’ (Biker)మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తుండగా.. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా.. మూవీ మేకర్స్ వాయిదా వేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. ఇక ఈ చిత్రంతో పాటు శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’లోనూ నటిస్తున్నారు.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సంయుక్త మీనన్, సాక్షి వైద్యా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో పాటు శర్వానంద్, శ్రీనువైట్ల (Srinuvaitla)దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే శర్వానంద్ తన లుక్ కోసం కసరత్తులు ప్రారంభించారు. ఇక శ్రీను వైట్ల ‘విశ్వం’ యావరేజ్ ఫలితాన్ని సాధించిన తర్వాత శర్వానంద్ సినిమాలో బాగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారట. తాజాగా, ఈ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ మూవీ కోసం మ్యాడ్, 8వసంతాలు ఫేమ్ అనంతిక సనీల్ కుమార్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. ఈ రెండు చిత్రాలతో కుర్రకారు హృదయాలను కొల్ల కొట్టిన క్రేజీ బ్యూటీ అనంతిక అయితే శర్వానంద్ సరసన బాగుంటుందని ఆమెను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించనున్నారు.






