పెళ్లి కోసం 15 ఏళ్లు వెయిట్ చేశాం.. ఆ సమయంలో చాలా భయపడ్డానంటూ కీర్తి సురేష్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh), జగపతి బాబు(Jagapathi Babu) హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

పెళ్లి కోసం 15 ఏళ్లు వెయిట్ చేశాం.. ఆ సమయంలో చాలా భయపడ్డానంటూ కీర్తి సురేష్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh), జగపతి బాబు(Jagapathi Babu) హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పెళ్లి విషయంలో ఎందుకంత టైమ్ తీసుకున్నారని జగపతి ప్రశ్నించగా.. ‘‘పెళ్లి విషయంలో మేము కావాలనే సమయం తీసుకున్నాం. 2010లో నేను చదువుకునే సమయంలోనే ప్రేమలో పడ్డాం. కానీ ముందు చదువు పూర్తి కావాలని.. కెరీర్ పరంగా సెట్ అవ్వాలని నిర్ణయించుకున్నాం.

నేనే సినిమాలతో బిజీగా ఉన్నాను. అతను ఖతార్‌లో ఉండి ఆయిల్ పరిశ్రమలో వ్యాపారం చూసుకున్నాడు. దాదాపు 15 ఏళ్లు ప్రేమలో ఉన్నాం. ఈ సమయంలో ఏమైనా గొడవలు జరిగి విడిపోతామని భయమేసింది. ఆ సమయంలోనే పెళ్లి గురించి ఇంట్లో చెప్పడం మంచిదని నిర్ణయించుకున్నాం. కానీ ఇంట్లో మతం గురించి ఏమైనా గొడవలు అవుతాయని చాలా భయపడ్డాను. అయినప్పటికీ ధైర్యం చేసి ఒకరోజు మా నాన్నకు ఆంథోనీ గురించి చెప్పాను.

ఆ సమయంలో నాన్న ఒప్పుకోడని చాలా భయపడ్డా.. కానీ ఒప్పుకున్నారు. దీంతో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యాం. అయితే మా పెళ్లి కొంతమందిని పిలవలేకపోయాను. అందుకు మీకు క్షమాపణలు చెప్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన నటించనుంది. ఈ మూవీ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రాబోతుంది. ఇటవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Next Story