- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదంలో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా.. అక్కడ బ్యానర్లు చించేసిన జనాలు (వీడియో)
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన సినిమా ‘కింగ్‌డమ్’(Kingdom).

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన సినిమా ‘కింగ్‌డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘కింగ్‌డమ్’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇందులో శ్రీలంకలోని తమిళ ప్రజలను విలన్లుగా చిత్రీకరించారని పలువురు కామెంట్లు పెడుతున్నారు.
ఈ వివాదం కాస్త ముదరడంతో తమిళనాడులోని ఒక థియేటర్స్‌లో సినిమా నడుస్తుండగా.. థియేటర్‌పై ఉన్న ‘కింగ్‌డమ్’ బ్యానర్‌ను చించేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ‘కింగ్‌డమ్’ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఇందులో సత్యదేవ్, వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు.






