గర్ల్ ఫ్రెండ్ కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. గుడ్ న్యూస్ ప్రకటించబోతున్నారా?

by Mallepaka Hamsa |

నేషనల్ క్రష్ ఇటీవల ‘థామా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

గర్ల్ ఫ్రెండ్ కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. గుడ్ న్యూస్ ప్రకటించబోతున్నారా?
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ ఇటీవల ‘థామా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend). దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకుల మనసులు దోచేస్తూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. కంటెంట్ పరంగా మహిళళు ఆకట్టుకుంటుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.

హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో ఈ వేడుకను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా విజయ్ దేవరకొండ రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో రష్మిక(Rashmika Mandanna), విజయ్ (Vijay Deverakonda)కలిసి పెళ్లి డేట్ ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? అని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గత కొద్ది కాలంగా రష్మిక, విజయ్ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారట.

కానీ ఈ విషయాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఇటీవల రష్మిక మాత్రం ఓ పాడ్‌కాస్ట్‌లో భాగంగా విజయ్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ చిన్న హింట్ ఇచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ నిమిషాల్లో వైరల్ అయిపోయాయి. కానీ కొంతమందిలో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం తెలియాలంటే వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తే.. కానీ వీరి పెళ్లిపై క్లారిటీ వచ్చేలా లేదు.

Next Story