నల్ల కుక్కలు, ఆయుధాలతో విజయ్ దేవరకొండ సంచలనం.. అంచనాలను పెంచుతున్న కొత్త సినిమా ప్రకటన

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-18 06:27:50  IST  )

ఈ సవాలుతో కూడిన పనిని చేపట్టిన మా బృందాన్ని చూసి గర్విస్తున్నాను. నా సర్వస్వాన్ని ఈ సినిమా కోసం ధారపోస్తాను

నల్ల కుక్కలు, ఆయుధాలతో విజయ్ దేవరకొండ సంచలనం.. అంచనాలను పెంచుతున్న కొత్త సినిమా ప్రకటన
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ఆసక్తికరమైన దశలో ఉన్నాడు. వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తున్న విజయ్, ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్థన్’ చిత్రాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అయితే, గత కొద్దిరోజులుగా 'హాయ్ నాన్న' ఫేమ్ దర్శకుడు శౌర్యువ్, విజయ్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందంటూ జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు తెరపడింది. ఈ ప్రాజెక్టుపై విజయ్ దేవరకొండ అధికారికంగా ప్రకటన చేస్తూ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ సినిమా సాధారణ యాక్షన్ డ్రామా కాదని, ఇందులో మైథలాజికల్ (పౌరాణిక) అంశాలు మిళితమై ఉన్నాయని సమాచారం. ఫిల్మ్ నగర్ వర్గాల టాక్ ప్రకారం, ఇది ఒక సోషియో ఫాంటసీ లేదా పౌరాణిక టచ్‌తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. "శౌర్యువ్ అపరిమితమైన ఊహలకు ప్రతిరూపంగా ఈ సినిమా ఉండబోతోంది. ఒక అద్భుతమైన గ్లోబల్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తోంది.

ఈ సవాలుతో కూడిన పనిని చేపట్టిన మా బృందాన్ని చూసి గర్విస్తున్నాను. నా సర్వస్వాన్ని ఈ సినిమా కోసం ధారపోస్తాను" అని ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. సినిమా ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్ మూడు నాలుగు పవర్‌ఫుల్ బ్లాక్ డాగ్స్‌ను (నల్ల కుక్కలను) వెంటబెట్టుకుని నడుస్తుండగా, ఆయన వెనుక ఉన్న బృందం కత్తులు, బాణాలు, బల్లాలు వంటి యుద్ధ పరికరాలతో అత్యంత ఆగ్రహంతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా "ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమే" అనే క్యాప్షన్ సినిమాలోని లోతైన కథను, విజయ్ పాత్రలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. ఒకప్పుడు ప్రేమగా ఉన్న వ్యక్తి, ఇంతటి ఆగ్రహంతో యుద్ధానికి ఎందుకు సిద్ధమయ్యాడనే ఆసక్తిని ఈ పోస్టర్ రేకెత్తిస్తోంది.వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హాయ్ నాన్న’, ‘ఖుషి’, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలకు అదిరిపోయే సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. శౌర్యువ్ మేకింగ్ స్టైల్,విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్ కలిస్తే థియేటర్లలో రచ్చ ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Next Story