మళ్లీ ట్రెండింగ్‌లో 'నాటునాటు' సాంగ్.. చిందేసిన ఇంగ్లీష్ ఆడియన్స్..

by Dishafeatures2 |
మళ్లీ ట్రెండింగ్‌లో నాటునాటు సాంగ్.. చిందేసిన ఇంగ్లీష్ ఆడియన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: 'ఆర్ఆర్ఆర్' ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సినిమాల్లో ఒకటి. ఈ సినిమా రిలీజ్ మొదటి రోజు నుంచే ప్రతి థియేటర్లలో ప్రత్యేక వైబ్స్ సృష్టించింది. ఈ మూవీ విజయంలో యాక్షన్‌తో పాటు మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. పాటల్లో 'నాటు నాటు' పాటకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసిన ఈ పాటే వినిపించింది. థియేటర్లలో ఈ పాటకు యువత చిందేస్తూ రెచ్చిపోయింది. తాజాగా మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట సోసల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందులో ఈ పాటకు థియేటర్లోనే ఇంగ్లీష్ ఆడియన్స్ స్టెప్పులేశారు. అయితే ఈ సినిమా ఆస్కార్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్న సందర్భంగా తాజాగా లాస్ ఏంజెల్స్‌లోని చైనీస్ థియేటర్లో ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది.

ఈ స్క్రీనింగ్‌కు జక్కన్న కూడా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆడియన్స్ నాటు నాటు పాటకు థియేటర్లో చిందేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. థియేటర్లో ఈ పాటకు విదేశీయులు చిందేస్తున్నారంటే ఇక పాటకున్న పాపులారిటీ అర్థం చేసుకోవచ్చంటూ రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే చరిత్రలో ఓవర్సీస్‌లో అధిక కలెక్షన్ చేసిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ మూవీ ఓవర్సీస్ రూ.1200 కోట్ల వరకు వసూలు చేసింది.

ఇవి కూడా చదవండి : మహిళా ఎంపీ డ్యాన్స్‌ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా..(వీడియో)



Next Story

Most Viewed