మహిళా ఎంపీ డ్యాన్స్‌ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా..(వీడియో)

by Disha Web Desk 21 |
మహిళా ఎంపీ డ్యాన్స్‌ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో పండుగలను ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవుని ఉత్సవాలు వచ్చాయంటే చాలు ప్రోగ్రామ్స్ నిర్వహించి హాంగామా సృష్టిస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్‌లోని నవరాత్రి ఉత్సవాలు సరదా, సంబరాలతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్త్రీలు పెద్ద యెత్తున ఉత్సవాల్లో పాల్గొని డ్యాన్స్‌లు చేస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

అయితే తాజాగా నదియా జిల్లాలో దుర్గామాతా నవరాత్రి ఉత్సవాల్లో టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రా పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి బెంగాలీ జానపద సాంగ్‌కు ఆమె డ్యాన్స్ చేసి ప్రతీ ఒక్కరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇక ఆమె వేసిన ప్రతీ స్టెప్పు వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇక అందుకు సంబంధించిన డ్యాన్స్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి ఎనలేని ప్రశంసలను పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి : మళ్లీ ట్రెండింగ్‌లో 'నాటునాటు' సాంగ్.. చిందేసిన ఇంగ్లీష్ ఆడియన్స్..




Next Story

Most Viewed