- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Toxic: రాకింగ్ స్టార్ సినిమాలో నలుగురు హాట్ హీరోయిన్లు.. నెట్టింట హైప్ పెంచుతున్న న్యూస్
స్టార్ హీరో యశ్(Yash), గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘టాక్సిక్’ (Toxic).

దిశ, సినిమా: స్టార్ హీరో యశ్(Yash), గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘టాక్సిక్’ (Toxic). దీనిని కేవీఎన్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్(Monster Mind Creations) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంగా గోవా బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ యాక్టర్స్ మాత్రమే కాకుండా బ్రిటిష్ యాక్టర్స్ అయినటువంటి డారెల్ డీ సిల్వా, బెనెడిక్ట్ గ్యారెట్ లాంటి ప్రముఖులు నటిస్తున్నారు. అలాగే టోవినో థామస్, సుదేవ్ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఇయర్‌లోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్‌లో స్టార్స్ అయినటివంటి నయనతార(Nayanthara), కియారా అద్వానీ(Kiara Advani), తారా సుతారియా(Tara Sutaria), హ్యుమా ఖురేషి(Hyumakhureshi) తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఈ నలుగురు యంగ్ అండ్ హాట్ హీరోయిన్లు ఒక్కసారిగా సెట్‌లో వాలిపోతే ఎలా ఉంటుందో.. తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ పరిస్థితి ఏమిటో అనే విషయం ప్రస్తుతం క్యూరియాసిటీగా మారింది.
కాగా యష్ హీరోగా నటించే ఈ సినిమాలో నయనతార ఆయనకు సోదరిగా నటిస్తున్నారు. అలాగే రాకింగ్ స్టార్‌కు జంటగా కియారా అద్వానీ కనిపించబోతున్నారు. ఇక హ్యుమా ఖురేషి విలన్ పాత్రలో నటిస్తుండగా.. తారా సుతారియా పాత్రను చాలా సీక్రెట్‌గా చిత్ర యూనిట్ ఉంచుతున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.






