బాత్ రూమ్ ఫొటోస్ షేర్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇబ్బంది లేదంటూ పోస్ట్

by Disha Web Desk 7 |
బాత్ రూమ్ ఫొటోస్ షేర్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇబ్బంది లేదంటూ పోస్ట్
X

దిశ, సినిమా: ‘ఏ మాయ చేశావే’ సినిమాతో 2010 టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. అయితే.. అనూహ్యంగా మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత.. ‘ఖుషి’ మూవీ అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. అంతక ముందు ఒప్పుకున్న సినిమాల అడ్వాన్స్‌లు కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసి తన పూర్తి ఫోకస్ ఆరోగ్యం పైనే పెట్టింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చి.. పుణ్య క్షేత్రాలను సైతం దర్శించుకోవడంతో పాటు.. ఆరోగ్య పరంగా కూడా ఎన్నో శ్రద్ధలు తీసుకుంది.

ఇక మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న సామ్.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది సమంత. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా.. అప్పుడప్పుడూ ఫొటో షూట్‌లతో కూడా అలరిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్ రూమ్‌లో దిగిన ఫోటోలను షేర్ చూస్తూ ‘ఇబ్బంది పడటం లేదు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో సామ్.. వైట్‌ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి మత్తెక్కించే పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్


Next Story

Most Viewed