తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్

by Mamatha |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్
X

దిశ, తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ హీరోయిన్ సమంత దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయంలోకి చేరుకున్న సమంతకు, అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సమంతను ఆశీర్వదించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సమంతను చూసిన అభిమానులు దగ్గరకు వచ్చి పలకరిస్తూ, ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అదేవిధంగా సమంతతో పాటు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.అందులో తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమ్యశ్రీ, మరో యాక్టర్ నాగ మహేష్, కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఉన్నారు.

Read More..

త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న సమంత.. అందుకేనా ఆ గుడిలో పూజలు?

Next Story