టాలీవుడ్ సీనియర్ నటుడి కారు ఢీ కొని, బీఆర్ఎస్ నేత మృతి!

by Disha Web Desk 8 |
టాలీవుడ్ సీనియర్ నటుడి కారు ఢీ కొని, బీఆర్ఎస్ నేత మృతి!
X

దిశ, సినిమా : ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడి కారును ఓ బైకర్ ఢీ కొన్న ఘటన నల్లగొండ జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బైక్‌తో రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ వ్యక్తి నటుడు రఘుబాబు కారును వేగంగా ఢీ కొట్టి, అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

అసలు విషయంలోకి వెళితే..టాలీవుడ్ సీనియర్ నటుడు రఘుబాబు హైదరాబాద్ నుంచి మిర్యాల గూడ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత పట్టణంలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన తన దత్తసాయి వెంచర్ నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే బైపాస్ రోడ్డు వద్ద యాక్సిడంట్ కాగా,దీంతో అతను స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.కాగా, మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్ధన్ రావు(51)గా పోలీసులు గుర్తించారు.బైక్ పై వస్తున్న జనార్ధన్ ను ఢీకొట్టిన కారు దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ నేత అక్కడికక్కడే మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రఘుబాబుతో వాగ్వాదానికి దిగారు. కానీ ఆయన తన తప్పు ఏం లేదని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story