టిల్లు స్వ్కేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు నవ్వించాడా?

by Disha Web Desk 8 |
టిల్లు స్వ్కేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు నవ్వించాడా?
X

దిశ, సినిమా : యూత్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ దర్శకత్వంలో, సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైనా డీజే టిల్లుకు సీక్వెల్‌గా టిల్లు స్వ్కేర్ మూవీ తెరకెక్కింది. ఇక ఈరోజు రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? టిల్లు మళ్ళీ హిట్ కొట్టాడో లేదో చూద్దాం.

టిల్లు స్వ్కేర్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. సిద్ధు తన కామెడీ, బాడీ లాంగ్వేజ్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా డీజే టిల్లుకు మించి పంచ్ డైలాగ్స్‌తో అందరినీ తెగ నవ్విస్తాడు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం తన కామెడీతో మూవీ నవ్వులతో సాగిపోగా, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకే పెద్ద హైలెట్ అవుతుంది. దీంతో సెకండాఫ్ ఎంతో ఇంట్రెస్ట్‌గా ఉంటుందో అనిపిస్తుంది కానీ, చాలా యావరేజ్‌గా సాగిపోతుదంట. అయితే సినిమాలో ఈ సారి సిద్ధు కథపై ఫోకస్ చేసి కామెడీని కాస్త తగ్గించినట్లు అనిపిస్తుందని, ఇంకాస్త కామెడీ ఉంటే బాగుండేది అంటున్నారు నెటిజన్స్.

ఇక సిద్ధు హీరోగానే కాకుండా స్టోరీ, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ టిల్లు స్క్వేర్‌తో మ‌రోసారి త‌న టాలెంట్‌ను నిరూపించుకున్నాడు, స్క్రీన్‌ప్లే డిఫ‌రెంట్‌గా ఉంది. ఇక టిల్లు స్వ్కేర్‌లో అనుపమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ సినిమాల్లో కనిపించని విధంగా రొమాంటిక్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది. లిల్లీగా తన గ్లామర్‌తో యూత్‌ను మాయచేస్తుంది. అంతే కాకుండా సినిమాలో అనుపమ, సిద్ధు కెమిస్ట్రీ మూవీకే పెద్ద ప్లస్ పాయింట్. వీరిద్దరు తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.ఇక డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి గెస్ట్‌గా క‌నిపించి ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. ఇక ఓరల్‌గా చెప్పుకుంటే సినిమా మరోసారి యూత్‌ను మాయ చేయడం ఖాయమని, తన కామెడీతో నెటిజన్స్‌ను ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద 60 నుంచి 65 కోట్లకు పైగా వసూలు చేస్తుంది అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ సినిమాకు 2.5/5 రేటింగ్ ఇచ్చారు.


Next Story