‘హరి హర వీరమల్లు’ కలెక్షన్స్ రివీల్ చేయకపోవడానికి బలమైన కారణం ఉంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

‘హరి హర వీరమల్లు’ కలెక్షన్స్ రివీల్ చేయకపోవడానికి బలమైన కారణం ఉంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ(Jyothi Krishna) తెరకెక్కించగా.. నిధి అగర్వాల్(Nidhi Agarwal), అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, కీలక పాత్రలో నటించారు. ఈ పీరియాడికల్ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దయాకర్ రావు నిర్మించారు. ‘హరిహర వీరమల్లు’ భారీ అంచనాల మధ్య జులై 24న థియేటర్స్‌లోకి వచ్చింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లు ఎంత వచ్చాయనేది మూవీ టీమ్ ప్రకటించలేదు.

ఇటీవల స్టార్ హీరోల చిత్రాన్నింటి కలెక్షన్లు స్వయంగా చిత్రబృందం ప్రకటిస్తున్న క్రమంలో.. ‘హరిహర వీరమల్లు’ టీమ్ వెల్లడించకపోవడం గమనార్హం. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ మా సినిమా కలెక్షన్స్ ప్రకటించకపోవడానికి బలమైన కారణం ఉంది. మనం నిజాయితీగా కలెక్షన్లు గురించి చెప్పినా.. కరెక్టా, కదా అని చాలామంది చర్చింస్తుంటారు. కలెక్షన్స్ గురించి బయట టాక్ వస్తూనే ఉంటుంది. కొన్ని వెబ్‌సైట్లు కూడా రాస్తుంటాయి. అందుకే ఒకప్పటిలాగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది అని పోస్టర్ల ద్వారా చెబుతున్నాం. రాబోయే రోజుల్లో మూవీ టీమ్ నుంచి కలెక్షన్స్‌పై ప్రకటన రావచ్చు. నార్త్‌లోనూ తెలుగు వెర్షన్ విడుదలైంది. హిందీ ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story