- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది.. కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) ‘తేరే ఇష్క్ మే’(tere ishk mein)మూవీతో రాబోతుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) ‘తేరే ఇష్క్ మే’(tere ishk mein)మూవీతో రాబోతుంది. ఇందులో స్టార్ హీరో ధనుష్ (Dhanush)సరసన రొమాన్స్ చేయనుంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ లవ్ స్టోరీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు మరో ప్రాజెక్ట్ చేస్తోంది. ఇక కృతి సనన్ ఓ వైపు షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నప్పటికీ పలు ఈవెంట్లకు వెళ్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్‌లో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది.
ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే.. దాదాపు సగం మంది మహిళల వైద్యానికి సరిపడా నిధులు ఉండడం లేదు. మహిళల ఆరోగ్యంతో పాటు లింగ సమానత్వం కోసం కూడా అధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మహిళ ఆరోగ్యం అనేది అంత తేలికగా తీసుకునే అంశం కాదు. మానవాళి భవిష్యత్తుకు మూల స్తంభం లాంటిది’’ అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొందరు కృతి సనన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






